1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (15:57 IST)

మసూద్ అజార్‌కు వత్తాసు పలికిన చైనా? ఐరాస వీటోను మళ్లీ ఆరు నెలల పాటు పొడిగించింది..

పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానా

పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్‌ అజార్‌‌కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది. తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలని చైనా నిర్ణయించింది. 
 
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్‌ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుండా భారత తీర్మానం తానంతట అదే ఆమోదం పొందేది. కానీ చైనా ఆరునెల పాటు ఈ వీటోను పొడిగించడం ద్వారా.. పాక్ ఉగ్రవాదికి చైనా వంత పాడినట్లైంది. 
 
అయితే ఈ వీటో పొడిగింపును చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షుయంగ్‌ సమర్థించుకున్నారు. భారత్‌ తీర్మానంపై ఇప్పటికీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత పక్షాలు మరింతగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తన వీటోను పొడిగించినట్టు చెప్పుకొచ్చారు.