సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 జులై 2017 (14:34 IST)

గౌరవంగా వెళ్లండి లేదా తన్ని తరిమేస్తాం : భారత్‌కు చైనా వార్నింగ్

భారత్ సైన్యానికి చైనా వార్నింగ్ ఇచ్చింది. డోకా లా ప్రాంతం నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే మంచిదని లేనిపక్షంలో తన్ని తరుముతామంటూ హెచ్చరించింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కఠువు వ్యాఖ్యలతో

భారత్ సైన్యానికి చైనా వార్నింగ్ ఇచ్చింది. డోకా లా ప్రాంతం నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే మంచిదని లేనిపక్షంలో తన్ని తరుముతామంటూ హెచ్చరించింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కఠువు వ్యాఖ్యలతో కూడిన సంపాదకీయాన్ని రాసింది.
 
సిక్కిం భూభాగంలోని డోకా లా ప్రాంతంలోకి చైనా హద్దుమీరి వచ్చి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా, ఈ ప్రాంతం భూటాన్‌ దేశ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో గడచిన 19 రోజులుగా డోకా లా ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మోహరించగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొనివుంది. ఇరు దేశాల సైనికులు పరస్పరం తోపులాటకు కూడా దిగారు. 
 
ఈ నేపథ్యంలో... చైనా మరో హెచ్చరిక చేసింది. డోకా లా తమ పరిధిలోనిదేనని చెబుతూ, భారత సైన్యం గౌరవంగా వెనుదిరిగితే బాగుంటుందని, లేకుంటే తాము తన్ని తరిమేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సర్వ సన్నద్ధంగా ఉందని పేర్కొంది. 
 
అదేసమయంలో చైనా భూభాగం నుంచి భారత దళాలను తరిమేసే శక్తి తమకు లేదని ఆ దేశం భావిస్తే, అది వారి అవివేకమని వ్యాఖ్యానించింది. భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేసింది. ఆయన చెప్పిన మాటలు వాస్తవమేనని, 1962 నాటి ఇండియా ఇప్పుడు లేదని చెబుతూనే, తమ దళాలు రంగంలోకి దిగితే, అప్పటి కన్నా పెను నష్టం ఇండియాకు తప్పదని వార్నింగ్ ఇచ్చింది.