శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (19:22 IST)

కరోనా కంటే డేంజర్.. కజకిస్థాన్‌లో కొత్త వైరస్.. 628 మంది మృతి

Virus
చైనా పుణ్యంతో కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం కంటి మీద కునుకు లేకుండా ఉంది. అలాంటిది ఇపుడు మరో భయంకరమైన వైరస్ హల్చల్ చేస్తోంది. దీని వల్ల కజకిస్థాన్‌లో ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారని చైనా ప్రకటించింది. కజకిస్థాన్‌ చైనా పొరుగు దేశం. దీని గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనివల్ల 1,772 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు గాలి ద్వారా కూడా నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. తుంపర్లు వెలువడేందుకు కారణమయ్యే వైద్య విధానాల వల్ల సార్స్-కోవ్-2 వైరస్ గాలిద్వారా వ్యాపించగలదని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో కాకుండా మరో విధంగా కూడా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదా లేదా అన్న దానిపై ప్రస్తుతం విశ్లేషణ జరుపుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 
 
అంతగా వెంటిలేషన్ లేని మూసివుంచిన ప్రదేశాల్లో.. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వ్యాపిస్తున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. బృంద గానం, రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ క్లాసులు వంటి చోట్ల డ్రాప్‌లెట్స్‌తో పాటు తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వివరించింది.