గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (17:20 IST)

డొనాల్డ్ ట్రంప్ ఫోన్ హ్యాక్.. చైనా హ్యాకర్ల పనేనా.. కమలా హ్యారిస్ ప్రమేయం వుందా?

donald trump
చైనా హ్యాకర్లు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరుడు జెడి వాన్స్ ఉపయోగించిన ఫోన్‌లను లక్ష్యంగా చేసుకున్నారని యుఎస్ మీడియా నివేదించింది. వాటిల్లోని డేటా మొత్తం కూడా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది.
 
దీని వెనుక చైనా ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ, యూఎస్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్ధారించాయి. అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన కొంత కీలక డేటా ఇప్పుడు చైనా చేతుల్లోకి వెళ్లినట్టయిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 
 
దీనిపై ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యవహారాల పర్యవేక్షిస్తోన్న స్టీవెన్ ఘాటుగా స్పందించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు.