1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Chinese scientist arrested for smuggling deadly fungus into US

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

deadly fungus
deadly fungus
కరోనా చైనా ల్యాబ్ నుంచి పుట్టిందనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా మరో వ్యాధిని పుట్టించింది. కరోనా ప్రపంచానికి వచ్చిన కష్టాలు చాలవన్నట్లు ప్రస్తుతం చైనా.. అమెరికాలో ప్రయోగించేందుకు కొత్త వ్యాధిని పుట్టించింది. 
 
పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫంగస్ తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
చైనా, అమెరికాల మధ్య ముదురుతున్న విభేదాల కారణంగా అమెరికాను దెబ్బతీసే కుట్ర అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది బయోలాజికల్ వార్ అని అమెరికా ఆరోపిస్తోంది.
 
ఈ ఫంగస్ కారణంగా మానవులకు, పశువులకు హాని కలుగుతుంది. వాంతులు, కాలేయాన్ని దెబ్బ తీస్తోందని అమెరికా వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ శీలింధ్రాలు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తోంది.
తర్వాతి కథనం
త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా