బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

మొక్కజొన్న డ్రిల్ మిషన్‌ ఛాలెంజ్‌లో జుట్టు ఊడగొట్టుకున్న యువతి.. ఎక్కడ?

corn challange
సోషల్ మీడియాలో వేచ్చే ఛాలెంజ్‌లను కొందరు యువతీయువకులు నిజ జీవితంలో చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మొక్కజొన్న డ్రిల్ ఛాలెంజ్‌లో పాల్గొని జుట్టు ఊడగొట్టుకుంది. ఈ ఘటన చైనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
@ZerolQPeople అనే ట్విటర్ హ్యాండిల్లో షేర్ అయిన ఓ వీడియోలో యువతి రొటేటింగ్ కార్న్ చాలెంజ్‌ను స్వీకరించింది. ఇందులోభాగంగా, మొక్కజొన్నను డ్రిల్ మెషిన్‌కు గుచ్చి దానిని ఆన్ చేస్తారు. అది తిరుగుతుంటే నోటితో మొక్కజొన్న తినడం ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ప్రయత్నించి చాలా మంది పళ్లు రాలగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. 
 
అయితే, తాజాగా చైనాకు ఈ యువతి.. ఈ సవాల్‌లు పాల్గొని, జుట్టు ఊడగొట్టుకుంది. సదరు యువతి డ్రిల్ మెషిన్‌లో మొక్కజొన్న అమర్చి స్విచ్ ఆన్ చేసింది. మెషిన్ తిరుగుతుండగా మొక్కజొన్నను తినడానికి ప్రయత్నించింది. ఇంతలో ఆమె తల వెంట్రుకలు కొన్ని డ్రిల్ మిషన్‌లో ఇరుక్కుని పోయాయి. దాంతో ఆ డ్రిల్ మెషిన్ ఆమె ముందరి భాగంలో ఉన్న జుట్టును లాగేసింది. జుట్టు ఊడిన భాగంలో రక్తస్రావం కూడా అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.