శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:59 IST)

పుష్ప 2- సెట్స్ నుంచి వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Pushpa: The Rise
పుష్ప సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' అనే పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ చిత్రంలో అల్లు అర్జున్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. అతను ఓ లారీని కలిగి ఉన్న సంగతి కూడా తెలిసిందే. కానీ కథ సాగుతున్న కొద్దీ ఇలాంటి వాహనాలను ఎన్నో కలిగి ఉన్నట్లు ఈ వీడియోలో చూపిస్తున్నారు. 
 
వైరల్ అవుతున్న వీడియోలో, చాలా ట్రక్కులు పార్క్ చేసిన భారీ దృశ్యాన్ని మనం చూడొచ్చు. కాగా 'పుష్ప 2: ది రూల్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.