బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:50 IST)

నేనెక్కడికీ పారిపోలేదు... హైదరాబాద్‌లోనే ఉన్నాను : నవదీప్

navdeep
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తాను నగరం వీడిపారిపోయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ప్రకటనపై హీరో నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని భాగ్యనగరిలోనే ఉన్నట్టు చెప్పారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసారు. 
 
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల తాను ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం లేదని, దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని కోరాడు. నవదీప్ పరారీలో ఉన్నాడన్న వార్తలు వచ్చిన నిమిషాల్లోనే అతడు స్పందించడం విశేషం. తానొక్కడే (హైదారబాద్) ఉంటానని, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని నవదీప్ వివరించాడు.
 
కాగా, డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నం, మరో నిందితుడు కాప భాస్కర్ బాలాజీ ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నైజీరియన్లు సహా 8 మందిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. 
 
అదేసమయంలో సినీ నటుడు నవీదీప్, షాడో చిత్ర నిర్మాత ఉప్పలపాటి రవి, గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్ యజమాని సూర్య, బంజారాహిల్స్ లోని బిస్ట్రో, టెర్రా కేఫ్ యజమాని అర్జున్, విశాఖపట్టణానికి చెందిన కలహర్ రెడ్డి సహా మరికొందరు పరారీలో ఉన్నట్టు పేర్కొంది. ఆ వెంటనే నవదీప్ స్పందించి ఈ షార్ట్ వీడియోను విడుదల చేయడం గమనార్హం.