క్వీన్స్‌లాండ్ నేషనల్ పార్కులో అర్థరాత్రి స్విమ్మింగ్ చేసిన మహిళ.. మొసలి దాడిలో?!
ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో 46 ఏళ్ల మహిళ కిండీ వాల్డ్రోన్ చేసిన సాహసం ఆమె ప్రాణాలను బలిగొంది. అయితే ఆమె మొసలి దాడిలో చనిపోయిందని వార్తలు వస్తుండగా.. ఆమె జాతీయత విషయంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. క్వ్నీ46 ఏళ్ల మహిళ... తన స్నేహితురాలితో కలిసి నేషనల్ పార్క్‌లో సాహసం చేస్తానంటూ అర్థరాత్రి స్విమ్ చేస్తుండగా.. ఓ మొసలి ఆమెపై దాడి చేసింది.
అయితే మహిళ అరుపులు, కేకలకు నేషనల్ పార్క్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె ఎక్కడ నుంచి వచ్చిందని.. ఆమె జాతీయత విషయంలో పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఆస్ట్రేలియాలో నివసిస్తుందని... కుటుంబమంతా న్యూజిలాండ్‌లో ఉంటున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.