చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ ప్రాంతంలో అన్నెం శృతి అనే యువతి చిక్కుకునిపోయింది. ఈ యువతి కర్నూలు జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం. ఈ యువతి టీసీఎల్ కంపెనీలో పనిచేస్తూ వస్తోంది. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టులో తిరుపతి నుంచి 60 మంది ఉద్యోగులతో కలసి చైనా వెళ్లింది.
అయితే, చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ ఉన్న భారతీయులందరినీ కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలు నడిపింది. అయితే, అన్నెం శృతిని మాత్రం విమానం ఎక్కనివ్వలేదు. దీనికి కారణం ఆ యువతినికి 90 డిగ్రీల జ్వరం ఉండటంతో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా దించేశారు.
తనతో పాటు మిగిలిన ఇద్దరు చెరో చోట చిక్కుకుని ఉండిపోయామని.. తిండి మందులు ఏమి ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం బీజనవేములలో ఉంటున్న తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో ద్వారా సమాచారం చేరవేసింది.
శృతికి ఈనెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో వివాహంనిశ్చయం అయింది.
పెళ్లి దగ్గర పడుతున్న తరుణంలో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.