గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (12:42 IST)

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. జాక్ మా విరాళం.. ఎంతో తెలుసా?

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనాతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 14 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌కు పోరాటానికి తన వంతు సాయమిదని ప్రకటించారు. 
 
ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత ''పోని మా'' సైతం 300 మిలియన్ యువాన్లు విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి.