శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:07 IST)

అలీబాబా చీఫ్.. ఆరు రోజులు.. ఆరుసార్లు శృంగారం.. కొత్త అర్థం.. రిటైర్మెంట్

చైనాలో అలీబాబా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన జాక్ మా అనే వ్యక్తి ఈ సంస్థను స్థాపించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. చివరికి ఓ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్‌గా జీవితం ప్రారంభించారు. 1999లో దానికి స్వస్తి పలికి స్నేహితుల సహాయంతో అలీబాబాడాట్ కామ్‌ను ప్రారంభించారు.
 
ఓ అపార్టుమెంటులో చిన్న ఆఫీస్ పెట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అలీబాబాను ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థగా మార్చేశారు. ప్రస్తుతం అలీబాబా సంస్థ ఛైర్మన్ జాక్ మా (54) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారానికి ఆరు రోజులు, ఆరుసార్లు శృంగారం, ఎంతసేపు చేశామనేదే ముఖ్యమని సెక్స్ జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పారు. 
 
సెక్స్ ప్రాధాన్యం ఎలాంటిదో చెప్పి ప్రపంచానికి కొత్త సూత్రాలు నేర్పిన అలీబాబా సంస్థ చైర్మన్ జాక్ మా.. రిటైర్మెంట్ ప్రకటించారు. సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్ పదవిలో కొనసాగారు. 2013లోనే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్​ఛైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు గ్రూప్ ప్రస్తుత సీఈవో డానియెల్ ఝాంగ్‌ను జాక్ తన వారసుడిగా ప్రకటించారు.