శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (16:37 IST)

ఆ విషయంలో చైనాను మించిపోయిన భారత్.. లాక్ డౌన్‌లో..?

లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చైనాను కూడా మించిపోయి. కొత్త రికార్డును నమోదు చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రెండు నెలల పాటు ఇంటి పట్టునే జనాలు వున్నారు. 
 
దేశంలోనూ కూడా లాక్ డౌన్ గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో జనాలుంటే.. మనదేశ ప్రజలు మాత్రం శృంగారంలో మునిగి తేలుతున్నారట. పిల్లలను కనే పనిలో బిజీ బిజీగా ఉన్నారట.
 
ప్రస్తుతం ఇదే రికార్డుగా నిలిచిపోనుంది. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు. అంటే లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలోనే నమోదు అవుతున్నాయి.