ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (10:13 IST)

24 గంటల్లో 103 మంది మృతి.. దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదుకాగా, 103 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 16,539 మంది డిశ్చార్జి కాగా, 1,886 మృతి చెందినట్టుగా తెలిపింది. ప్రస్తుతం దేశంలో 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. 
 
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడులలోనే ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల దాదాపు 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు కాగా, 694 మంది మృతిచెందారు.