శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 13 మే 2017 (16:54 IST)

వాళ్లకి కావల్సింది కిడ్నీ, లైంగిక సుఖం... కాదంటే తొక్కేస్తారు...

ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. లైంగిక అవసరాలు తీర్చుకునే వస్తువుగా మహిళను చూసే దేశాలు చాలానే వున్నాయి. వారి మానాన్ని దోచుకోవడమే కాకుండా వారి అవయవాలను అమ్ముకుని ఆ తర్వాత వారితో వ్యాపారం చేయడం కూడా ఇటీవల కొన్ని దేశాల్లో ఎక్క

ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. లైంగిక అవసరాలు తీర్చుకునే వస్తువుగా మహిళను చూసే దేశాలు చాలానే వున్నాయి. వారి మానాన్ని దోచుకోవడమే కాకుండా వారి అవయవాలను అమ్ముకుని ఆ తర్వాత వారితో వ్యాపారం చేయడం కూడా ఇటీవల కొన్ని దేశాల్లో ఎక్కువైంది. పొరుగు దేశం నేపాల్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. బాగా ఆరోగ్యంగా వున్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఇంట్లో ఎవరూ లేనప్పుడు సదరు మహిళతో పాటు ఆమె బిడ్డలను కిడ్నాప్ చేసేస్తారు. 
 
ఆ తర్వాత సదరు మహిళకు మత్తు ఎక్కించి ఆమె కిడ్నీని తీసుకుంటారు. మత్తు నుంచి తేరుకునేలోపే ఆమె వేశ్యా వాటికకు అమ్ముడైపోతుంది. ఇక అక్కడ్నుంచి ఆమెకు నరకం కనపడుతుంది. గాయం మానుతుండగానే కామాంధులు మహిళపై అఘాయిత్యం చేస్తారు. లైంగిక ఆనందం తీర్చకపోతే చిత్రహింసలకు గురిచేస్తారు. మహిళలతో పాటు కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన పిల్లలపై రాక్షసుల్లా విరుచుకుపడుతారు. సిగరెట్లతో పిల్లల నాలుకలపై కాల్చుతారు. అప్పటికీ వినకపోతే మహిళ శరీరంలో మరికొన్ని అవయవాలు తీసేసుకుని ఆమెను మురుగు కాల్వలో తొక్కి చంపేస్తారు.
 
ఇలాంటి దారుణాలను చూడలేక సదరు మహిళలు లైంగిక సుఖాన్ని తీర్చే బొమ్మలుగా మారిపోతారు. ఈ దారుణాలు నేపాల్ లోని కాబ్రేపాలన్ చౌక్ లో తరచుగా జరిగేవే. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే వుండరు. దారుణాలు జరుగుతూ వుంటాయి. తమ గోడు ఎవరు పట్టించుకుంటారని రోదిస్తుంటారు ఇక్కడి మహిళలు.