గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (16:06 IST)

చితికి నిప్పంటించేటప్పుడు కేరింతలు కొట్టారు.. ఫేస్ బుక్ పేజీలో పోస్టులు..

చితికి నిప్పంటించేటప్పుడు బాధపడటం చూసేవుంటాం. అయితే అక్కడి చితిపెడితే కేరింతలు కొడతారు. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఇది జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున

చితికి నిప్పంటించేటప్పుడు బాధపడటం చూసేవుంటాం. అయితే అక్కడి చితిపెడితే కేరింతలు కొడతారు. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఇది జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో వరుసగా ఏర్పాటుచేసిన దండాలకు చితిలా పేర్చి పెట్రోల్‌ కుమ్మరించి నిలువునా దహనం చేశారు. 
 
వందలాది మంది జనం కేరింతల మధ్య గత వారం నైరోబీలో కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో తుపాకులకు నిప్పుపెట్టారు. అగ్నికి ఆహుతైన తుపాకుల్లో అధికశాతం ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినవేనని తెలిపారు. తుపాకులను పేర్చి దహనం చేసిన దృశ్యాలను విలియమ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. 
 
సోమాలియాలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్న విలియమ్.. ఇకపై అలాంటి చర్యలను ఉపేక్షించబోమని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఇప్పుడు కాల్చేసినవి కాకుండా కెన్యాలో మరో ఐదు లక్షల అక్రమ ఆయుధాలు ఉన్నట్లు, అతి త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుని తగలబెడతామన్నారు.