డోనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు విలువలెంతో తెలిస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. అక్షరాల 10 బిలియన్ డాలర్ల పైనే ఉంటుంది. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.66 వేల కోట్లన్న మాట. ట్రంప్ బిజినెస్ పర్సనాలిటి (రియల్ ఎస్టేట్) కావడంతో ఆయన ఆస్తి విలువ మించిపోతే రూ.వెయ్యి కోట్లో లేదంటే రూ.రెండు వేల కోట్లో ఉంటుందని అందరూ అనుకుంటారు.
కానీ ఈయన ఆస్తుల విలువ తెలియగానే అమెరికన్లతో పాటు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కాగా అమెరికా అధ్యక్షపదవి రేసులో ఉన్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులు తమ తమ ఆదాయ చిట్టాలను ఫెడరల్ కమిషన్‌కు సమర్పించారు. తన ఆస్తుల విలువను ఎన్నికల సంఘానికి ట్రంప్ అందజేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
గతేడాది జులైలో తాను అధ్యక్ష పదవి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆస్తుల వివరాలను తెలియజేశారు. గతంతో పోలిస్తే.. ట్రంప్ ఆస్తుల విలువ దాదాపు 190 మిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశానని.. ఎఫ్‌ఈసీ చరిత్రలోనే ఇంతమొత్తం ఆస్తులు కలిగిన అభ్యర్థిని తానే కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన ఆస్తుల్లో చాలా వరకు ప్రపంచ ప్రముఖ కట్టడాలున్నాయన్నారు.