శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:28 IST)

లోకల్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. 36 మంది మృతి..

లోకల్ రైళ్లు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు మరణిం

లోకల్ రైళ్లు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈజిప్టు ఉత్తరతీరంలోని అలెగ్జాండ్రియాలో చోటుచేసుకుంది. 
 
అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. సహాయక చర్యలు జరుగుతున్నందువల్ల ఇంకా మృతుల సంఖ్య మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.