100 కిలోమీటర్లు సెల్ ఫోన్ చూడకుండా డ్రైవింగ్ చేస్తే.. కాఫీ ఫ్రీ.. జపాన్ కొత్త యాప్
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రైవింగ్ బారిస్టా అనే యాప్‌ను జపాన్ పరిచయం చేసింది. జపాన్ దేశంలో గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉందని ఆ దేశ ప్రభుత్వం వె
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రైవింగ్ బారిస్టా అనే యాప్‌ను జపాన్ పరిచయం చేసింది. జపాన్ దేశంలో గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.
అందుచేత రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రైవింగ్ బారిస్టా అనే యాప్‌ను జపాన్ పరిచయం చేసింది. జపాన్ దేశంలో గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం మొబైల్ ఫోనేనని తేలింది.
డ్రైవింగ్ బారిస్టా అనే స్మార్ట్ ఫోన్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్‌ను ఉపయోగించడానికి బ్రేక్ వేసేందుకు వీలుంటుందని జపాన్ భావిస్తోంది. ప్రమాదాలకు బ్రేక్ వేసే దిశగానే ఈ యాప్ రూపొందించబడింది.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల మేర సెల్ ఫోన్‌లో మాట్లాడకుండా.. సెల్ ఫోన్‌ను చూడకుండా బండిని నడిపితే.. వేడి వేడి కాఫీ లేదా కూల్ కాఫీలు ఫ్రీగా పొందవచ్చునని జపాన్ ఆఫర్ ప్రకటించింది. దీనిపై టయోటాకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించబడిన యాప్ ఇదేనని వ్యాఖ్యానించారు.
ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చుననన్నారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని డ్రైవర్లు లబ్దిపొందాలని.. రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడాలని చెప్పారు.