మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (10:03 IST)

కరోనా కట్టడికి మరో 21 మందులు

కరోనా వైరస్‌ కట్టడి చేయడానికి మరో 21 మందులను కనిపెట్టినట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ బర్న్‌హోమ్‌ ప్రిబైస్‌ మెడికల్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను చేస్తున్నారు.

ప్రస్తుతం వాడకంలో ఉన్న 12,000 ఔషధాలను పరిశీలించిన తర్వాత అందులో 21 ఔషధాలకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగల లక్షణాలున్నాయని వీరు నిర్ధారించారు.

ఇందులో నాలుగు ఔషధాలను ఇప్పటికే కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసిర్‌తో కలిసి వాడొచ్చని పేర్కొన్నారు. వీరి పరిశోధనాంశాలను నేచర్‌ పత్రిక ప్రచురించింది. తమ పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇప్పటికే వాడుతున్న రెమ్‌డిసివిర్‌ అందరిలోనూ ప్రభావాన్ని చూపలేకపోతుందని, దాంతో కలిపి వాడేందుకు 21 మందులను సిద్దం చేసినట్లు చెప్పారు.