బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (22:32 IST)

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. కరోనా టెస్టుకు రూ.15వేలు.. పాజిటివ్‌కు రూ.75వేలు

కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కరోనాను అరికట్టేందుకు  సంచలన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా అనుమానితులు టెస్ట్ చేయించుకుంటే వారికి రూ.15వేలు చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా టెస్ట్ చేసుకున్న తరవాత పాజిటివ్ వస్తే వారికి భారత కరెన్సీ ప్రకారం రూ. 79,586 చెల్లిస్తామని ప్రకటించింది. 
 
అయితే కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. కరోనా విజృంభణ సమయంలోను ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ వారికి ఇదివరకు ఎలాంటి వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేసింది. 
 
పాజిటివ్ వచ్చినవారు వారి పే స్లిప్‌లను సమర్పించాలని తెలిపింది. కాగా కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.