శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (11:58 IST)

రెపో రేటు తగ్గింపు.. మారటోరియంను మరో 3 నెలల పొడిగింపు

RBI
ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. 
 
ఇంకా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. రెపోరేటును 4.4 శాతం నుంచి 4 శాతానికి, రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గించడంతో పాటు మారటోరియంను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటనలు చేశారు. మారటోరియం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని... సామాన్యులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదని సామాన్యులు అంటున్నారు.  
 
రెపో రేటు 4 శాతానికి తగ్గించడంతో రుణ రేట్లు తగ్గినప్పటికీ ఈ నిర్ణయం వల్ల డిపాజిట్ రేట్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ నిర్ణయాల వల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుందని సామాన్యులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు.