గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:31 IST)

చైనాలో మరో వుహాన్ ... వణికిస్తున్న హర్బిన్ ... డజన్ల కొద్దీ కేసులు

చైనా దేశాన్ని వుహాన్ నగరం వణికించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇపుడు వుహాన్‌లో పురుడుపోసుకుంది. ఆ తర్వాత ఆ నగరాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ వైరస్ వేలాది మంది పడ్డారు. అలాగే, మరణాలు కూడా సంభవించాయి. ప్రస్తుతం వుహాన్ నగరం మెల్లగా కోలుకుంటుంది. అయితే, వుహాన్‌ను తలదన్నేలా హర్బిన్ నగరం పేరు ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఈ నగరంలో డజన్ల కొద్దీ ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
అంటే, ఈ ఈశాన్య నగరం హర్బిన్ ఇప్పుడు చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్నటి వరకు వూహాన్‌పై పంజా విసిరిన కరోనా... ఇప్పుడు హర్బిన్‌ను టార్గెట్ చేసింది. కోటి వరకు జనాభా కలిగిన హర్బిన్‌లో డజన్ల కొద్దీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో, హర్బిన్‌తో పాటు ఈశాన్యంలోని పలు నగరాల్లో వారం క్రితం నుంచి కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
 
హర్బిన్‌ నగరంలో ఒక్కసారిగా కొత్త కేసులు వెలుగులోకి రావడానికి కారణాలు లేకపోలేదు. అమెరికా, రష్యాల్లో ఉన్న చైనీయులు ఒక్కసారిగా తిరిగి రావడమే కేసులు పెరగడమే. న్యూయార్క్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి నుంచి 70 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో హర్బిన్ నగరాన్ని షట్‌డౌన్ చేశారు. ప్రజా రవాణాతో పాటు అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. వుహాన్ నగరంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని చైనా పాలకులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హర్బిన్ నగరం ఇపుడు వార్తలకెక్కింది.