గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (10:32 IST)

పిల్లలను ఓ కంట కనిపెట్టండి.. కాలి వేళ్ల గురు చుట్టూ అలా వుంటే..?

Covid-19
కాలి వేళ్లలో మార్పులు కనిపించినా.. కాలి వేళ్ల గోరు చుట్టూ లేదా కాళ్ల కింద చర్మం ఎర్రగా లేదా ఉదా రంగులో వుంటే.. అప్రమత్తం కావాలి. ఇంకా చర్మం పగిలినట్లు లేదా కమిలినట్లు ఉన్నదా? దురద లేక నొప్పి కలుగుతున్నదా? ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు కావచ్చని అమెరికా వైద్యులు చెబుతున్నారు.

''కోవిడ్‌ టోస్''గా పేర్కొనే ఈ లక్షణాలు ఎక్కువగా పిల్లలు, యువతతోపాటు కొద్దిపాటి వైరస్‌ లక్షణాలున్నవారిలో కనిపిస్తున్నట్లు చర్మ వ్యాధి నిఫుణులు అంటున్నారు. అయితే ఇవి కరోనా లక్షణాలేనా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు.
 
అలాగే మానవ ముక్కులోని రెండు కీలక కణాలు కరోనా వైరస్‌కు ప్రవేశద్వారాలుగా వ్యవహరిస్తున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ముక్కులోని ఏసీఈ-2, టీఎంపీఆర్ఎస్‌ఎస్‌-2 ప్రొటీజ్ అనే ప్రొటీన్లు కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని వారు గుర్తించారు. ముక్కు లైనింగ్ మీదున్న కణాలతో సహా శరీరంలోని వివిధ అవయవాల్లో కూడా ఇవి ఉన్నట్లు వారు వెల్లడించారు.
 
శ్వాసనాళాల్లోని ఇతర కణాలతో పోలీస్తే ముక్కులోని గోబ్లెట్ కణాలు, సిలియేటెడ్ కణాల్లో ఈ రెండు రకాల ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వైరస్‌ మానవ శరీరంలోకి వెళ్లేందుకు ఇవి ప్రాధమిక ఇన్‌స్పెక్షన్ మార్గాలుగా ఉపయోగపడుతున్నాయని వారాడన్ సుంగ్నాక్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.