బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:26 IST)

విజయవాడలో ఎస్ఐకి కరోనా పాజిటివ్.. ఖాకీల్లో టెన్షన్ - టెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడేలా కనిపించడంలేదు. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేసే సబ్ ఇన్‌స్పెక్టరుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఠాణాలో పని చేసే మిగిలిన కానిస్టేబుల్స్ అంతా భయంతో వణికిపోతున్నారు. 
 
ఇపుడు పాజిటివ్ వచ్చిన ఎస్ఐ‌తో మరో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. దీంతో అతనితో పాటు కలిసి ఉంటున్న ఎస్ఐ‌ని, అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, ఆ ఠాణాలోని మిగిలిన పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.