శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:14 IST)

సంపదతో మనశ్శాంతిని - ఆరోగ్యాన్ని పోల్చలేం : జగ్గూభాయ్

టాలీవుడ్ సినీ కమ్ విలన్ జగపతిబాబు. పంక్చువాలిటీలో ఆయనకు పెట్టింది పేరు. అంత నిక్కచ్చి మనిషి. ముక్కుసూటితత్వం ఆయన సొంతం. కపటం, కల్మషంలేని వ్యక్తి. అలాంటి జగ్గూభాయ్... ఇపుడు భావోద్వేనిగి గురయ్యాడు. బోలెడంత సంపద ఉంది. కానీ, స్వేచ్ఛగా జీవించేందుకు ఉచితంగా ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన గాలి, ప్రదేశం దొరకడం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ భావోద్వేగమైన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన అలా ట్వీట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. 
 
ప్రపంచాన్ని కరనా వైరస్ కమ్మేసింది. ఈ వైరస్ బారినపడి అనేక మంది చనిపోతారు. వీరిలో పేద, ధనిక అనే తేడాలేదు. ఇలా చనిపోయిన వారిలో పోర్చుగల్ దేశంలోని శాంటాండర్ బ్యాంక్ చీఫ్ ఆంటోనియా పియారా ఒకరు. ఈయన కరోనా సోకి చనిపోయారు. దీనిపై ఆయన కుమార్తె ఓ లేఖ రాసింది. ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖలో "మాకు చాలా డబ్బు ఉంది. ఉచితంగా లభించే గాలి దొరక్క ఒంటరిగా మా తండ్రి చనిపోయాడు. కానీ మా సంపద మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది" అని పేర్కొంది. ఈ లేఖ ఇపుడు వైరల్ అవుతోంది.
 
ఈ లేఖను చదివిన జగ్గూభాయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన స్పందనను ట్వీట్ రూపంలో పెట్టాడు. "అతను బతకాడిని అవసరమైన గాలిని ఆయనకున్న సంపద తీసుకురాలేకపోయింది. మనం జీవితాంతం నిర్విరామంగా పరిగెడుతూనే ఉన్నాం.. కానీ దేని కోసం.. ఇలాంటి భయంకరమైన బాధాకరమైన చావు కోసమా.. సంపదతో ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఎప్పటికీ పోల్చలేము" అంటూ ట్వీట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.