శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (18:34 IST)

పేటీఎం కొత్త ఆఫర్.. వారి కోసం క్యాష్ అట్ హోమ్

పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పేటీఎం నుంచి క్యాష్ ఎట్ హోమ్ అనే సేవలను ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం క్యాష్ అట్ హోమ్‌ను తీసుకొచ్చింది. డబ్బు కావాలనుకునే వారు యాప్‌లో రిక్వెస్ట్ పెడితే వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. రిక్వెస్ట్ పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దకు తీసుకొచ్చి అందిస్తారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు రాలేని పరిస్థితిలో వున్నారు. అలాంటి వృద్దులు, దివ్యాంగుల కోసం ఇలా క్యాష్ ఎట్ హోమ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది.
 
కనీసం రూ.1000 నుంచి అత్యధికంగా రూ.5000 వరకు అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండేవారికి ఈ సదుపాయం వుంటుంది. కొన్ని రోజుల క్రితం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ సేవలను కూడా పేటీఎం ప్రవేశపెట్టింది.