మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:38 IST)

లాక్‌డౌన్ పొడగింపు... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన మోసపూరితం : పీఐబీ

దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ పొడగింపు సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన సర్క్యులేట్ అవుతోంది. ముఖ్యంగా, ఈ లాక్‌డౌన్ ఐదు దశల్లో కేంద్రం అమలు చేయబోతుందంటూ ఓ ప్రచారం సాగుతోంది. దీన్ని భారత ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ పొడగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్న ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా విభాగం ప్రకటన మేరకు భారత్‌లో ఐదు అంచెల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందంటూ ఈ వదంతులు సృష్టిస్తున్నారు. ఈ వదంతులన్నీ బూటకమని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.