బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:13 IST)

ఈ-వ్యాలెట్‌తో జాగ్రత్త.. ఏమరుపాటు వద్దే వద్దు.. డబ్బులు స్వాహా!

కాస్త అజాగ్రత్తతో వుంటే.. అకౌంట్లో డబ్బులు స్వాహా అవుతాయి. సైబర్ నేరగాళ్లు డబ్బు లాగేసేందుకు సిద్ధంగా వున్నారు. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని.. టెక్నాలజీని ఉపయోగించుకుని పక్కాగా డబ్బులు గుంజేస్తున్నారు. 
 
పేటీఎం వాడుతున్నట్లైతే... మీరు పేటీఎం ద్వారా డబ్బు చెల్లిస్తే... మీకు డబుల్ అమౌంట్ రిటర్న్ వస్తుంది. కావాలంటే ఓ రూ.5 కింది నంబర్‌ అకౌంట్‌కు పే చెయ్యండి. మీరు రూ.10 చెల్లిస్తే... మీకు రూ.20 వస్తాయి. అదే రూ.1000 చెల్లిస్తే... రూ.2000 వస్తాయి.. అంటూ వచ్చే మెసేజ్‌లను ఏమాత్రం నమ్మకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 
ఇలా డబుల్ మనీ ఇస్తామని ఏవైనా మెసేజ్‌లు వస్తే... వాటిని పూర్తిగా చదవక ముందే డిలీట్ చేసేయాలి. ఇలాంటి కేసుల్లో నేరస్థుల్ని పోలీసులు పట్టుకోవడం కష్టం ఎందుకంటే వాళ్లు ఇండియాలో లేకపోవచ్చు. ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా డబ్బు కాజేస్తూ ఉండొచ్చు. జనరల్‌గా హ్యాకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి... వీళ్ల ఉచ్చులో చిక్కి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం కంటే... ముందే జాగ్రత్త పడితే మేలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.