సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (16:23 IST)

మందేసి ఫ్లైట్ ఎక్కాడు.. పోలీసులకు చుక్కలు చూపాడు...

రష్యాలోని ఓరెన్‌బర్గ్ నగరం నుండి మాస్కో వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ఓ ప్రయాణీకుడు పోలీసు అధికారులతో కొట్లాటకు దిగాడు. అంతేకాకుండా ఫ్లైట్ నుండి దిగేందుకు నిరాకరించాడు. తాను ప్రయాణించడం కోసం టిక్కెట్ కూడా తీసుకున్నట్లు వారితో వాగ్యుద్ధానికి దిగాడు.
 
ఫ్లైట్ నుండి అతడిని బయటకు పంపేందుకు వచ్చిన పోలీసు అధికారులతో గట్టిగా అరువులు మొదలెట్టాడు.."నేను ఎక్కడికీ వెళ్లను. నేను డబ్బులు కూడా చెల్లించాను. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తే, నేను వెళ్తాను'' అని బిగ్గరగా అరిచాడు.
 
పోలీసులు అలాగే చేస్తామని, తనని మరుసటి రోజు ప్రయాణించేందుకు అనుమతినిస్తామని, ప్రస్తుతానికి మాత్రం ఇతర ప్రయాణీకులు వేచి ఉన్నట్లు అతడికి తెలిపారు. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. 
 
ఎలాగోలా పోలీసు అధికారులు అతడిని బలవంతంగా బయటకు లాగేసారు. పోలీసు అధికారులను అవమానించినందుకు, ఫుల్‌గా మందు తాగి, ఇష్టానుసారం ప్రవర్తించినందుకు ఆ ప్రయాణికుడు విచారణను ఎదుర్కొంటున్నాడు.