శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:59 IST)

విడాకులు తీసుకుంటున్నా.. డైవర్సీ అనే పెర్‌ఫ్యూమ్ రిలీజ్ (video)

Dubai Princess
Dubai Princess
దుబాయ్‌కి చెందిన యువరాణి తన ఇన్‌స్టాలో తన విడాకుల గురించి ప్రత్యేక పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు షేక్ మహ్రా. 
 
ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టా వేదికగా మరోసారివిడాకులపై ఒక వీడియోను రిలీజ్ చేశారు. తన భర్తతో విడిపోతున్నట్లు గతంలోనే షేక్ మహ్రా వెల్లడించారు. తాజాగా, ఆమె డైవర్సీపై ఒక పెర్‌ఫ్యూమ్ వీడియో సైతం విడుదల చేశారు. 
 
మహ్రా ఎమ్1 పేరుతో పర్ ఫ్యూమ్ బ్రాండ్‌ను విడుదల చేశారు. విడాకులు తీసుకున్నమరు క్షణమే ఇలా డైవోర్స్ అంటూ పెర్ ఫ్యూమ్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెర్ఫ్యూమ్ యొక్క టీజర్‌ను పంచుకుంది, 'విడాకులు' అనే పదంతో కూడిన సొగసైన నల్ల బాటిల్‌ను వెల్లడించింది.