గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:10 IST)

సచిన్ స్నేహితుడు అలా నిలబడలేకపోతున్నాడే.. ఏమైంది? (video)

Vinod Kambli
Vinod Kambli
వెటరన్ ఇండియన్ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి అధ్వానంగా వుంది. నిలబడటానికి కూడా ఆయన ఇబ్బంది పడిపోతున్నారు. సరిగ్గా నడవడానికి కష్టపడ‌డం వీడియోలో క‌నిపించింది. దాంతో ఇద్ద‌రు వ్య‌క్తులు అత‌డిని చేతులు ప‌ట్టుకుని రోడ్డుపై నుంచి ప‌క్క‌కు తీసుకెళ్ల‌డం వీడియోలో ఉంది. 
 
అయితే, వీడియో చూసిన వారిలో కొంద‌రు అత‌ను తాగి ఉన్నాడ‌ని చెబుతుంటే.. మరికొందరు ఆయ‌న కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నాడని, అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల సరిగ్గా న‌డ‌వ‌లేకపోతున్నాడని చెబుతున్నారు. 
 
కాగా, ఈ వీడియోను ఓ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) యూజ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. మద్యం, అహం ఏమి చేస్తుందో చూడండి అంటూ తెలిపాడు. ఇంకా సచిన్ వినోద్ కాంబ్లీని ఆదుకోవాలన తెలిపాడు.