గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (10:30 IST)

ఈజీ జెట్‌ ఫ్లైట్‌కు ఉగ్రభయం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్... ముగ్గురి అరెస్టు

ఈజీ జెట్ ఫ్లైట్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండ

ఈజీ జెట్ ఫ్లైట్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండన్ కు 151 మంది ప్రయాణికులతో ఈజీ జెట్ ఫ్లైట్ ఒకటి బయలుదేరింది. 
 
ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారని కొంతమంది ప్రయాణికులు విమానం సిబ్బంది చెవిలో ఊదారు. ఈ సమాచారాన్ని పైలట్లకు చేరవేయగా, వారు ఏటీసీకి చేరవేశారు. దీంతో విమానాన్ని జనసంచారం అంతగా ఉండని కొలోంగ్‌లోని బాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి, ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపారు. 
 
ఆపై ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి బ్యాక్‌ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాక్‌ప్యాక్‌‌లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అన్న విషయం తెలియరాలేదు. వీరు ఎవరు? విమానంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనతో యూరప్‌లో గత రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 10 విమానాలను దారి మళ్లించగా, 20 విమానాల ప్రయాణం ఆలస్యమైంది.