శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (11:12 IST)

అక్కడ కాలు పెట్టినవారంతా చనిపోయారు... ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కన్నుమూత

చంద్రమండలంపై పాదం మోపిన వారంతా చనిపోయారు. చివరకు ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కూడా కన్నుమూశారు. డిసెంబర్ 1972లో 'అపోలో 17' మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో జీవించి ఉన్న ఆఖరు వ్యక్తి ఎ

చంద్రమండలంపై పాదం మోపిన వారంతా చనిపోయారు. చివరకు ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కూడా కన్నుమూశారు. డిసెంబర్ 1972లో 'అపోలో 17' మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో జీవించి ఉన్న ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ సోమవారం కన్నుమూశారు. ఈయనకు వయసు 82 యేళ్లు. వృద్దాప్య సమస్యలతో చనిపోయారు. దీంతో చంద్రునిపై కాలుమోపిన వారెవరూ ఇప్పుడిక భూమిపై లేనట్టే. 
 
ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని నాసా పేర్కొంది. కాగా, అపోలో మిషన్ కోసం అక్టోబర్ 1963లో 14 మంది ఆస్ట్రోనాట్‌లను నాసా ఎంపిక చేయగా, అందులో ఎగ్యూన్ కూడా ఒకరు. జూన్ 1966లో 'జెమినీ 9' మిషన్‌లో భాగంగా జరిగిన మూడు రోజుల అంతరిక్ష పర్యటనకు ఆయన పైలట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు గంటల పాటు ఆయన స్పేస్ వాక్ కూడా చేశారు. ఆపై అతనికి 'అపోలో 17'లో పర్యటించే అవకాశం వచ్చింది.