బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (14:25 IST)

ప్రేమ పేరుతో డిన్నరుకు పిలిచాడు.. భవనంలో బందీ చేశాడు.. ఆపై పలుమార్లు అత్యాచారం..?

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుని 17 ఏళ్ల వయసున్న ఓ కువైట్ యువతి స్నేహం చేసింది.

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుని 17 ఏళ్ల వయసున్న ఓ కువైట్ యువతి స్నేహం చేసింది. చాటింగ్ చేస్తూ.. వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకుంది. అంతే ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి రెస్టారెంట్‌కు రమ్మన్నాడు. 
 
ప్రేమ పేరుతో అనుకున్నట్లే ఇంట్లో చెప్పకుండా ఆ యువతి.. అతడిని కలిసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడే డిన్నర్ చేశారు. ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ భవనంలోకి తీసుకెళ్లి.. బందీని చేశాడు. 
 
మూడు రోజుల పాటు ఆమెను అదే గృహంలో బంధించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై వదిలిపెట్టాడు.. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేశాడు. మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆమె తల్లితో విషయం చెప్పింది. ఆపై బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.