ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 22 నవంబరు 2022 (09:03 IST)

చైనా అన్యాంగ్ సిటీలో అగ్నిప్రమాదం... 36 మంది మృతి

anyang fire accident
చైనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దేశంలోని హెనాన్స్ ప్రావిన్స్ అన్యాంగ్ నగరంలో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ కంపెనీలో మంటలు చెలరేగి ఏకంగా 36 మంది వర్కర్లు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు స్థానిక అధికారుల సమాచారం. 
 
అన్యాంగ్ సిటీలోని హైటెక్ జోన్‌లో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ వర్క్‌షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ పని పూర్తయ్యేందుకు రాత్రి 11 గంటలు అయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 36కు చేరిదని, మరో ఇద్దరు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.