శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:30 IST)

ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు సూసైడ్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శనీయుడు, క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా తీవ్రమై ఒత్తిడిలో ఉన్న ఆయనకు వైద

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శనీయుడు, క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా తీవ్రమై ఒత్తిడిలో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఒత్తిడిని భరించలేక సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని క్యూబా ప్రభుత్వ అధికారిక మీడియా క్యూబాడెబాటే వెల్లడించింది. ఆయన శుక్రవారం ఉదయం ఈ విషాదానికి పాల్పడ్డాడు. కాగా, 68 ఏళ్ల డియాజ్ బలార్ట్, చూసేందుకు అతని తండ్రిలాగానే కనిపిస్తుండటంతో, అతన్ని 'ఫిడెలిటో' అని క్యూబన్లు ముద్దుగా పిలుచుకునేవారు.