గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:32 IST)

లాటరీ వీసా విధానానికి స్వస్తి... డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ తీయడం ద్వారా వీసాలను ఇస్తున్న విధానానికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ తీయడం ద్వారా వీసాలను ఇస్తున్న విధానానికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. వలస చట్టాలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తెచ్చేందుకు పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించారు. ఈ ప్రసంగంలో తనపై ఉన్న చెడు అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు. తనతో కలసి పనిచేసి అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడాలని డెమోక్రాట్లకు పిలుపునిచ్చిన ఆయన, నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించారు. 
 
దాదాపు 80 నిమిషాలు సాగిన తన ప్రసంగంలో నిపుణులైన వారికి, అమెరికా వృద్ధికి కృషి చేస్తూ, ఇక్కడి వారిని గౌరవించే స్వభావంతో పాటు విద్య, ఉద్యోగ అర్హతలు, గుణగణాలు ఉన్నావారికి ప్రతిక్షణమూ స్వాగతం పలుకుతామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
తన ప్రసంగంలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించారు. తనతో కలసి పనిచేసి అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడాలని డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల వెంట ఎటువంటి పత్రాలూ లేకుండా అమెరికాలో కాలుపెట్టిన 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు, మెక్సికో సరిహద్దులో గోడ సహా సరిహద్దు భద్రత, లాటరీ ద్వారా వీసాల జారీకి ముగింపు, కుటుంబ సమేతంగా వలసలను నివారించడం వంటి అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా పేర్కొన్నారు. v