శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (14:58 IST)

ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు.. 200 సంవత్సరాలు జీవిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ఇచ్చారు. ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు వున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నారని.. జ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ఇచ్చారు. ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు వున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నారని.. జాక్సన్ వెల్లడించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారిగా జాక్సన్ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు 200 సంవత్సరాల పాటు జీవించే అనుకూలతలు ఉన్నాయని షాకింగ్ నిజాన్ని చెప్పారు.
 
ట్రంప్ ఆహార మెనూనూ మెరుగ్గా మార్చి ఉంటే 200 ఏళ్లపాటు నిక్షేపంలా జీవించేందుకు అవకాశం ఉండేదన్నారు. మానసిక పరీక్షలో భాగంగా కాగ్నిటివ్‌ను పరీక్షిస్తే.. 30కి 30 మార్కులొచ్చాయి. కానీ కొంత మేర మేధస్సు అతనిలో క్షీణించింది. దీన్నే అల్జీమర్స్‌గానూ పేర్కొంటారని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ ఎంతో చురుకైన వారని.. ఆయన ఆలోచన శక్తి విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.