శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (11:17 IST)

మగాడి వాసన తగలకూడదు.. కానీ పిల్లలు పుట్టాలి.. ఆ మహిళ ఏం చేసిందంటే...

మగాడి పక్కలో పడుకోకుండానే పిల్లలు పుట్టాలి ఇందుకోసం ఆ మహిళ సరికొత్త విధానాన్ని ఎంచుకుంది. ఈ మహిళకు పోలీసులు కూడా సహాయం చేయడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

మగాడి పక్కలో పడుకోకుండానే పిల్లలు పుట్టాలి ఇందుకోసం ఆ మహిళ సరికొత్త విధానాన్ని ఎంచుకుంది. ఈ మహిళకు పోలీసులు కూడా సహాయం చేయడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫ్లోరిడాకు చెందిన ఫేలిసియా నెవిన్ అనే 26 యేళ్ళ మహిళ మగాడి పక్కలో పడుకోకుండానే పిల్లలను కనాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కృత్రిమ గర్భధారణ పద్ధతిని ఎంచుకుంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వకుండా ఓ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి తన కోరిక గురించి చెప్పింది. దీంతో వైద్యులు ఓ థర్మోస్ ప్లాస్క్‌లో పురుషుడి వీర్యాన్ని సేకరించి ఆ యువతికి అందజేశారు.  
 
ఇక్కడిదాకా అంతా మహిళ అనుకున్నట్లే జరిగిపోయినా.. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంటికెళ్లిన తర్వాత దాని మూత తీయడానికి మహిళ బెంబేలెత్తిపోయింది. మూత తీస్తే థర్మోప్లాస్క్ ఎక్కడ పేలుతుందేమోనన్న భయం పట్టుకుంది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించి తనకు సహాయం చేయాల్సిందిగా కోరింది. తన వివరాలను గోప్యంగా ఉంచాల్సిందిగా కోరింది.
 
మహిళ కోరిక మేరకు.. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. థర్మోప్లాస్క్ మూత తీసిచ్చారు. యువతి వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు సైతం హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా పోలీసులు బహిర్గతం చేశారు. కానీ, ఆమె నివాస స్థలం, ఇతరాత్రా వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.