1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (15:40 IST)

రహస్యంగా వ్యభిచారం.. నలుగురు చైనీయుల అరెస్టు :: కువైట్‌లో ఆ సమయంలో మార్కెట్లు మూత!

రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు చైనీయులను పోలీసులు అరెస్టు చేశారు. సాల్మియా ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు చేపట్టారు.
 
ఈ తనిఖీల్లో నలుగురు చైనీయులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా మరో ఇద్దరు ట్రాన్స్ సెక్సువల్స్(లింగమార్పిడి చేయించుకున్నవారు) ఉన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వీరు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
 
మరోవైపు.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో వ్యాపార లావాదేవీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోజున పెద్ద ఎత్తున నిర్వహించే ప్రార్థనలకు దుకాణాలు తెరిచి ఉండడం వల్ల ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదను ఫత్వా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్‌కు పంపించింది. ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే వచ్చే శుక్రవారం నుంచే దుకాణాలపై నిషేధం అమల్లోకి వస్తుంది.