గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (12:23 IST)

ఆ దేశంలో కుర్రకారుకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ

condome
ప్రాశ్చాత్య దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో ఇటీవలికాలంలో అవాంఛిత గర్భాలు ఎక్కువై పోతున్నాయి. దీనికి కారణం యువతీ యువకులు వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటున్నారు. ఫలితంగా అవాంఛిత గర్భధారణలు, సుఖవ్యాధుల బారినపడేవారు సంఖ్య పెరిగిపోతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఫ్రాన్స్ పాలకులు 25 యేళ్ల లోపు ఉండే యువతకు ఉచితంగా కండోమ్స్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోగా, వీటిని జనవరి ఒకటో తేదీ నుంచి ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది. కేవలం పురుషులు వాడే కండోమ్‌లు మాత్రమే ఉచితంగా సరఫరా చేయనున్నారు. 
 
తొలుత 18 నుంచి 25 యేళ్ల లోపువారికే వీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే, మైనర్లకు రక్షణ వద్దా అనే విమర్శలు తలెత్తాయి. దీంతో 25 యేళ్లలోపు వారందరికీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సారథ్యంలోని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "థియరీ కంటే వాస్తవికత ఎంతో దూరంలో ఉంది. ఈ విషయంలో టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి" అని మైక్రాన్ పేర్కొన్నారు.