శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (16:49 IST)

మాజీ పోప్ బెనెడిక్ట్ XVI కన్నుమూత

pope
pope
సుమారు 8 సంవత్సరాల పాటు పోప్ పదవిలో కొనసాగిన బెనెడిక్ట్ XVI కన్నుమూశారు. అనారోగ్య కారణాలను చూపుతూ 2013లో రాజీనామా చేశారు. తద్వారా 1415లో గ్రెగొరీ XII తర్వాత పదవీ విరమణ చేసిన మొదటి పోప్ అయ్యాడు. బెనెడిక్ట్  XVI తన జీవితపు చివరి సంవత్సరాలను వాటికన్‌లోని మాథర్ ఎక్లేసియా ఆశ్రమంలో గడిపారు. ఆయన వారసుడు, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కలిసేవారు.
 
ఈ నేపథ్యంలో బెనెడిక్ట్ XVI శనివారం ఉదయం 9.34 గంటలకు వాటికన్‌లోని మాథర్ ఎక్లేసియా మఠంలో మరణించారు... అని వాటికన్ తెలిపింది. బెనెడిక్ట్ XVI మృతదేహానికి జనవరి 2న సెయింట్ పీటర్స్ బసిలికాలో అంత్యక్రియలు నిర్వహించబడుతుందని, అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని వాటికన్ తెలిపింది.  మరణించే నాటికి బెనెడిక్ట్ వయస్సు 95 సంవత్సరాలు.