శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (16:41 IST)

కంబోడియా హోటల్‌లో అగ్నిప్రమాదం... 26 మంది మృతి

Cambodian casino fire
Cambodian casino fire
కంబోడియాలోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కంబోడియా ఆగ్నేయాసియాలోని ఒక దేశం. ఇక్కడి స్టార్ హోటల్ సిటీ క్యాసినోలో నూతన సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు బస చేశారు.
 
ఈ నేపథ్యంలో గత రాత్రి 11:30 గంటల సమయంలో ఓ గదిలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పక్కనే ఉన్న గదులకు వ్యాపించాయి. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ఘటనపై 26 మంది మృతి చెందగా, 57 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.