శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (15:52 IST)

2023 యుగాంతానికి ఆరంభం అవుతుందట..!

Athos Salome
Athos Salome
బ్రెజిల్‌కి చెందిన 35 ఏళ్ల అతోస్ సాలోమ్ ఆస్ట్రాలజీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అతోస్ సాలోమ్ చెప్పిన వాటిలో చాలావరకు ఇప్పటికే జరిగాయి. కరోనా వైరస్, బ్రిటన్ రాణి మృతి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ సొంతం చేసుకోవడం వంటివి ముందే చెప్పుకున్నాడు. 
 
ఇక 2023కి సంబంధించి అతోస్ చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అతోస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన నోస్ట్రడామస్ అంటున్నారు. నోస్ట్రడామస్ 500 ఏళ్ల క్రితం భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే చెప్పాడు. 
 
ఇక అతోస్  2023లో ఏం జరుగుతాయని చెప్పాడంటే.. 
2023లో యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ ఓ ఉద్యమం మొదలవుతుందట.
అదే యుగాంతానికి ఈ ఏడాదే ఆరంభం అవుతుందట. 
 
ఇంకా క్రిప్టోకరెన్సీ అడ్డంగా లాస్ అవుతుందట. 
కృత్రిమ గర్భం పెరుగుతుందట 
2023లో అంటార్కిటికా నుంచి జాంబీ వైరస్ వస్తుంది. 
మొత్తానికి యుగాంతానికి మాత్రం 2023 ఆరంభ సంవత్సరం అవుతుందట.