మహేశ్ శర్మ అలా చెప్తే.. ఫ్రాన్స్ ప్రధాని ఇలా చెప్పారేంటి? ఎద అందాలను కప్పుకోవద్దంటున్నారు..
మహిళలకు భద్రత కరువైంది. దేశ, విదేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలకు కారణం వారి డ్రెస్ కోడేనని కొందరంటున్నారు. అందుకే మహిళలు ఒళ్లంతా కప్పుకునే రీతిలో దుస్తులు ధరించాలన
మహిళలకు భద్రత కరువైంది. దేశ, విదేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలకు కారణం వారి డ్రెస్ కోడేనని కొందరంటున్నారు. అందుకే మహిళలు ఒళ్లంతా కప్పుకునే రీతిలో దుస్తులు ధరించాలని కేంద్ర మంత్రి మహేష్ శర్మ సూచించారు. అయితే ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మనువల్ వాల్స్ మాత్రం మహిళలు ఎద అందాలను తెలిసేలా డ్రెస్ చేయడమే స్వాతంత్ర్యం అంటున్నారు.
ఎద అందాలు తెలిసేలా.. ఫ్రాన్స్ రిపబ్లిక్ జాతీయ చిహ్నంగా గల మరియాన్ శిల్పమే ఇందుకు తగిన నిదర్శనమని పేర్కొన్నారు. దుస్తులతో కప్పేయని ఎద అందాలే ఫ్రాన్స్ ఉత్తమ ప్రాతినిధ్యానికి సంకేతమని వాల్స్ వ్యాఖ్యానించారు. అదే మహిళలకూ స్వాతంత్ర్యమని చెప్పారు. ఇంకేముంది.. ఫ్రాన్స్‌లో బురఖాలపై ఇప్పటికే నిషేధం గల సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాల్స్ ఎద అందాలను కప్పుకోవద్దని మహిళలకు సూచిస్తుంటే.. భారత కేంద్ర మంత్రి మాత్రం మహిళలు హుందాగా ఉండే దుస్తులు ధరించాలంటున్నారు. ఏది ఏమైనా.. పాశ్చాత్య దేశాలకు వాల్స్ చేసిన వ్యాఖ్యలు సరిపోతాయోమో కానీ భారత్‌కు మాత్రం మహేష్ శర్మ చేసిన వ్యాఖ్యలే ఉత్తమమని విశ్లేషకులు అంటున్నారు.