శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:33 IST)

61 ఏళ్ల వయస్సులో ‘గే’ కొడుకు కోరికను తీర్చిన తల్లి..

అమ్మా.. నాకు నాన్న అని పిలిపించుకోవాలని ఉంది.. నా కోరిక తీరే మార్గం లేదా.. అమ్మ అయితే తన బాధను అర్థం చేసుకుంటుందని 32 ఏళ్ల కొడుకు ఆశగా అమ్మను అడిగాడు. అందుకు ఆమె బాగా ఆలోచించి, వైద్యుని దగ్గరకు వెళ్లి చూద్దామని బయల్దేరారు. డాక్టర్లు వారి కేసు విని ఇది సాధ్యమే అని అన్నారు.


దీంతో తల్లీ కొడుకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పిల్లలు కావాలంటే భార్యాభర్తలు కదా హాస్పిటల్‌కు వెళ్లాల్సింది.. అయితే వీళ్లేంటి ఇలా అనుకుంటున్నారా?..ఇందులో అదే కదా ట్విస్ట్.. ఆధునిక వైద్య పరిజ్ఞానం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది.
 
అమెరికాలో నెబ్రస్కాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 61 ఏళ్ల సెసిలె ఎలెగ్ కొడుకు మేథ్యూ ‘గే’ కావడంతో ఇలియట్ డౌఘెర్టీ అనే మరో పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ భార్యా భర్తలయ్యారు కానీ అమ్మానాన్న కాలేకపోయారు. గే జంట పిల్లలని కనడం అసాధ్యమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో ఆ విషయాన్ని తల్లికి వివరించాడు మేథ్యూ. కొడుకు బాధను చూసిన తల్లి సరోగసి విధానం ద్వారా బిడ్డను కనిస్తానని కొడుక్కి మాటిచ్చింది.
 
వైద్యులు తన కొడుకు మేథ్యూ నుంచి తీసిన స్పెర్మ్‌ను, అలాగే అతని భర్త అయిన ఇలియట్ యొక్క సోదరి నుంచి అండాన్ని సేకరించి, సెసిలె గర్భంలో ప్రవేశ పెట్టారు. ఆమె తొమ్మిది నెలల అనంతరం ఒమాహాలోని నెబ్రస్కా మెడికల్ సెంటర్‌లో సెసిలె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఓ మహిళ సరోగసి ద్వారా కొడుకు కోసం మళ్లీ తల్లి కావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని వైద్యులు వివరించారు.