శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (17:44 IST)

పెళ్లికి ముందే గర్భందాల్చిన రజినీకాంత్ హీరోయిన్!

తమిళ చిత్ర పరిశ్రమలో 'మద్రాసు పట్టణం' మూవీతో తెరంగేట్రం చేసిన అమీ జాక్సన్.. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన "సింగ్ ఈజ్ బ్లింగ్", నవాజుద్దీన్‌తో కలిసి "ఫ్రీకీ అలీ" సినిమాల్లో పని చేసింది. చివరిగా శంకర్ "2.0" మూవీలో రజనీకాంత్ పక్కన నటించింది. అమీ నటించిన "కిక్ 2" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
అదేసమయంలో ఈమె మల్టీ మిలియనీర్ అయిన జార్జ్ పనాయిటౌను ఇష్టపడి గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. దీంతో త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. గర్భందాల్చినట్టు నిర్ధారణ కావడంతో వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇపుడు జార్జ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అమీ.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. వచ్చే అక్టోబరు నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కూడా చెప్పింది.
 
గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈ యేడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకుంది. బ్రిటన్‌కు చెందిన జార్జ్ ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఒకరు. ఈయన హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీలాంటి వంటి నక్షత్ర హోటల్స్‌ను నిర్వహిస్తున్నాడు.