శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 31 జులై 2017 (18:15 IST)

ఆఫ్ఘనిస్తాన్‌లో డా. గజల్ శ్రీనివాస్ శాంతి యాత్ర

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్‌లో ఆగష్టు 1 నుండి 6 వరకు శాంతియాత్ర చేయనున్నారు. ఈ శాంతి యాత్రలో భాగంగా వారు ‘దరి’ భాషలో రూపొందించిన “సలాం-బోగో” ఆడియో/వీడియో గీతాల ఆల్బం సి.డి ని ఆఫ్ఘనిస్తాన్ కా

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్‌లో ఆగష్టు 1 నుండి 6 వరకు శాంతియాత్ర చేయనున్నారు. ఈ శాంతి యాత్రలో భాగంగా వారు ‘దరి’ భాషలో రూపొందించిన “సలాం-బోగో” ఆడియో/వీడియో గీతాల ఆల్బం సి.డి ని ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌లో ఆగష్టు 3వ తేదిన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
 
శాంతియాత్రలో భాగంగా ఆగష్టు 1 నుండి 6 వరకు కాబూల్, మజార్-ఐ-షరీఫ్ తదితర ప్రాంతాలలో శాంతి గీతాల ప్రదర్శనలు ఇవ్వనున్నారని, ఆఫ్ఘనిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రత్యేకంగా నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో పాల్గొంటారని గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి సురేఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.