సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జనవరి 2025 (19:11 IST)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

china doctor
చైనాకు చెందిన ఓ వైద్యుడు ఒకరు వైద్యులను సంప్రదించకుండానే తనకుతానుగా వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇది తన భార్యకు బహుమతిఅంటూ ఆయన చెప్పుకొచ్చాడు. పైగా, తను వేసెక్టమీ ఆపరేషన్ వీడియోను సైతం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
చైనాకు చెందిన చెన్ వీ నాంగ్ వృత్తిరీత్యా వైద్యుడు. ప్లాస్టిక్ సర్జరీలు చేయడంలో దిట్ట. సొంత ఆస్పత్రి కూడా ఉంది. ఇక నాంగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో బిడ్డ అవసరం లేదని ఆ దంపతులు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే, అందరిలాగే భార్యకు ట్యూబెక్టమీ సర్జరీ చేయించకుండా.. తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. తన భార్యను సంతోషంగా ఉంచేందుకు ఈ సర్జరీకి అతను పూనుకున్నాడు. 
 
ఇక తన క్లినిక్‌‍లోనే వేసెక్టమీ ఆపరేషన్‌ను సొంతంగా చేసుకున్నాడు. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ శస్త్రచికిత్సకు గంట సమయం పట్టింది. ఎందుకంటే సొంతంగా చేసుకోవడం కారణంగా. వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన పెరగాలనే ఉద్దేశంతో ఆ సర్జరీ విధానాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. 
 
ప్రస్తుతం నాంగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వేసెక్టమీ ఆపరేషన్ విజయవంతమైనట్టు వెల్లడించారు. తనను తాను స్టెరిలైజ్ చేసుకోవడం చాలా విచిత్రమైన అనుభవం అని తెలిపాడు. మహిళలకు స్టెరిలైజేషన్ అనేది మరింత సంక్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, పురుషులలో ఇది చాలా ఈజీగా ఉంటుందని వీ నాంగ్ చెప్పుకొచ్చాడు.